కనిగిరి: పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల నిస్వార్ధ సేవ మరియు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజాసేవలో దేశానికి 25 ఏళ్లు నిస్వార్ధ సేవ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.