రాయదుర్గం: విద్యా, వైద్య, ఉపాధి సమస్యలు పరిష్కరించాలి - మంత్రి లోకేష్ కు AISF, AIYF బహిరంగ లేఖ
రాయదుర్గం నియోజకవర్గంలోని విద్యా, వైద్య, ఉపాధి సమస్యలను వెంటనే పరిష్కరించాలని AISF, AIYF నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాయదుర్గంలో AISF జిల్లా కోశాధికారి ఆంజనేయులు, AIYF జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కావలి కోట్రేష్ మాట్లాడారు. కర్ణాటక సరిహద్దు రాయదుర్గంలో ఉన్నత విద్య, మెరుగైన వైద్యం, ఉపాధి అవకాశాలు లేవన్నారు. బాలికలు చదువుకు దూరమవుతున్నారని, రాయదుర్గం ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు, యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.