గిద్దలూరు: రాచర్ల మండలంలో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి కలిసికట్టుగా స్థానిక ఎన్నికలలో పని చేద్దామన్న జనసేన నాయకుడు బాలకృష్ణ
అతి త్వరలో రాచర్ల మండలంలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో జనసేన, టిడిపి, బిజెపి ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా పనిచేయాలని రాచర్ల జనసేన పార్టీ నాయకుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం నిర్దేశించిన విధంగా మనకు కేటాయించిన స్థానాలలో కలిసికట్టుగా పోటీ చేయాలన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తూ అందరం ముందుకు వెళ్దామని ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలిపించుకునే విధంగా కలిసికట్టుగా పనిచేద్దామని బాలకృష్ణ కార్యకర్తలకు సూచించారు.