కనిగిరి: కనిగిరి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నారాయణ యాదవ్ హౌస్ అరెస్ట్
కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని ముందస్తు నోటీసులు ఇచ్చిన పోలీసులు, శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ను గృహనిర్బంధం చేశారు.