గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో పరిసరాల పరిశుభ్రం చేయించిన కమిషనర్ రమణబాబు, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో శనివారం కమీషనర్ రమణబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చెల్లించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రజలకు కమిషనర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.