రాయదుర్గం: హెచ్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని ఉద్దేహాల్ వద్ద రైతుల ధర్నా
హెచ్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ వద్ద రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. బళ్లారి - గుండ్లపల్లి ప్రధాన రహదారిపై వరి నార్లతో బైఠాయించి నిరసన చేపట్టారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జయచంద్రారెడ్డి స్థానిక నాయకులు ఓబుళేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనతో సుమారు గంటపాటు రాకపోకలు స్తంభించాయి.