యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో నిర్వాసితుల గోడు వర్ణనాతీతం
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో నిర్వాసితుల గోడు వర్ణనాతీతం. పెద్దారవీడు మండలం సుంకేసుల కలనూతల గుండంచర్ల గ్రామాలలో ఎలాంటి నష్టపరిహారం అందని నిర్వాసితులు లబోదిబోమంటున్నారు. వారి గోడును ఎల్లబోస్తున్నారు. మరో పక్క నష్టపరిహారం అందుకున్న నిర్వాసితులు ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్లాలని కనీసం మూడు నెలలు సమయం కేటాయించాలని కోరుతున్నారు. సర్వం కోల్పోయిన నిర్వాసితుల స్థానంలో కొత్తవారిని చేర్చి మాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన నిర్వాసితులను గుర్తించి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.