రాయదుర్గం: మారుమూల ప్రతిభకు వేదిక 'మన్ కీ బాత్' : మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
దేశంలో మారుమూల ప్రాంతాల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి దేశ ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమమే ప్రధాని మన్ కీ బాత్ అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాయదుర్గంలో బిజెపి నాయకులు ఏటూరి మహేష్ ఇంటిలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధాని కార్యక్రమం వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో సాధన చేసి గుర్తింపునకు నోచుకోని వారి ప్రతిభను దేశానికి పరిచయం చేయడం ఎంతో గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. దేశ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోడీ సత్సంబందాలు కొనసాగిస్తూ మనసులో మాట చెప్పారని తెలిపారు.