నారాయణపేట్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ పాల్గొని కాళోజీ గారి చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ సాహిత్యం, ప్రజా చైతన్యం కోసం కాళోజీ చేసిన సేవలను ఈ సందర్భంగా ఎస్పీ కొనియాడారు.