రాయదుర్గం: పల్టీ కొట్టిన కూలీల వాహనం 15 మందికి తీవ్ర గాయాలు
బళ్ళారి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఉద్దేహాల్ గ్రామానికి చెందిన 15 మంది కూలీలు బళ్ళారి సమీపంలో వ్యవసాయ పనుల కోసం టాటా ఏస్ లగేజీ వాహనంలో బళ్ళారికి వెళ్తున్నారు. ఆశుండి - చెరుకుంట మధ్య రహదారిపై వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు తీవ్రంగా గాయపడగా, మిగతా 5 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, 108 సిబ్బంది వెంటనే గాయపడిన వారిని బళ్ళారి కి తరలించారు.