రాయదుర్గం: కణేకల్లు క్రాస్ గురుకుల పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేసిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ
కణేకల్లు క్రాస్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ జట్లకు ఎంపికైన విద్యార్థులకు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్ లను పంపిణీ చేశారు. NHRPF జిల్లా అధ్యక్షుడు మామడూరు సురేష్ రెడ్డి, జోనల్ చైర్మన్ కావలి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి హరేసముద్రం రాముడు, ఎస్ఎంసీ చైర్మన్ రుద్రప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి చేతుల మీదుగా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.