రాయదుర్గం: మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ కు దూరంగా ఉండాలి : సీఐ దేవానంద్
మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ కు దూరంగా ఉండాలని, రాయదుర్గం సిఐ దేవానంద్ కోరారు. మంగళవారం రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అద్యక్షతన సదస్సు నిర్వహించి విద్యార్థులకు ట్రాఫిక్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమేనని, తల్లిదండ్రులు వారికి వాహనాలు ఇస్తే వారు శిక్షార్హులు అవతారని వివరించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొంది డ్రైవింగ్ చేయవచ్చన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. బాల్య వివాహాలు, వేధింపులపై డయల్ 100 కు ఫోన్ చేయాలని కోరారు.