యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లి విద్యా కమిటీ ఎన్నికల్లో గందరగోళం
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. కమిటీ ఎన్నికల సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో కొద్దిసేపు పాఠశాల ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి సమాచారం. పోలీసులు ఇది వర్గాలపై లాఠీచారి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాల్సిన చోట ఘర్షణ చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన చెందారు.