రాయదుర్గం: బొమ్మనహాల్ మండలంలో రెండవ రోజు ఉపందుకున్న ఎంపిటిసి నామినేషన్లు
బొమ్మనహాల్ మండలంలో ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ఊపందుకుంది. మండలంలో మెత్తం 16 ఎంపిటిసి స్థానాలు ఉండగా మెదటి రోజు 20 నాభి ధాఖలయ్యాయి. రెండవ రోజు గురువారం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టిడిపి నుంచి 24 కాగా వైసిపి నుంచి 20 నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన పార్టీ నుంచి 2 ఇండిపెండెంట్లు ఒకటి చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ సందర్భంగా పలు గ్రామాల నుంచి టిడిపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపు గా వచ్చి నామినేషన్లు వేశారు. ఎస్ఐ నబిరసూల్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.