రామచంద్రాపురం: సిద్దిపేటలో మహా పాదయాత్ర: జేపీ నడ్డా రాక - సంగారెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపు
సిద్దిపేటలో ఈ నెల 25న జరగనున్న మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని, జిల్లా నుంచి భారీగా తరలిరావాలని సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు. ఇండియా కూటమి దుష్ప్రచారంపై ప్రజల్లో వాస్తవాలను వివరించాలని కోరారు.