కంగ్టి: సంగారెడ్డి జిల్లాలో దారుణం: కౌలు రైతు పంటకు నిప్పు, 100 క్వింటాళ్ల సోయా బూడిద!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్క వడగాంలో దారుణం జరిగింది. కౌలు రైతు అశోక్ పండించిన 100 క్వింటాళ్ల సోయా పంటను గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టి తగులబెట్టారు. ఈ ఘటనలో 8 ఎకరాల పంట పూర్తిగా కాలిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు.