జిన్నారం: జిన్నారంలో రెండో రోజు పల్స్ పోలియో: ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తున్న సిబ్బంది
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో రెండో రోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయని వారిని గుర్తించి, ఆశా కార్యకర్తలు నేరుగా ఇళ్లకు వెళ్లి చుక్కలు వేస్తున్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం తల్లిదండ్రులు సహకరించాలని ఆశా కార్యకర్త నాగమణి కోరారు.