రాయదుర్గం: బైక్ చోరీ ఘటనపై స్పందించిన సిఐ, పొరపాటున ఎక్స్ఛేంజ్ అయ్యాయన్న సిఐ దేవానంద్
రాయదుర్గం పట్టణంలోని SBI బ్యాంక్ వద్ద బైక్ చోరీకి గురైందంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో బైక్ చోరీ జరగలేదని, పొరపాటున ఇద్దరి బైక్లు మారిపోయాయని CI సిఐ దేవానంద్ తెలిపారు. గోనబావికి చెందిన మంతేష్ బ్యాంక్ లో పని ముగించుకుని బయటకు వచ్చి తన బైక్ బదులు బ్యాంక్ ముందు ఉన్న నారాయణరెడ్డికి తీసుకెళ్లారని శుక్రవారం మీడియాతో తెలిపారు. సిసి పుటేజ్ లో ఉన్న మహంతేష్ దొంగ కాదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా పొరపాటున జరిగిన సంఘటన అని, ఎలాంటి చోరీ జరగలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను బైక్ చోరీగా భావించవద్దని CI దేవానంద్ కోరారు.