కొండపి: పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ ను వి ఆర్ కు తరలింపు, నూతన ఎస్సైగా శివ నాగరాజుని నియమించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం: పొన్నలూరు ఎస్సై సత్యనారాయణను విఆర్ కు తరలిస్తూ శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ స్థానంలో నూతన ఎస్ఐగా శివ నాగరాజును నియమించారు. అతి త్వరలో శివ నాగరాజు పొన్నలూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్ఐ సత్యనారాయణ ను వీఆర్‌కు తరలించిన కారణాలు తెలియవలసి ఉంది. అయితే బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే ఎస్సై విఆర్ కు పోవడంపై స్థానికంగా చర్చగా మారింది.