యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలో పల్లె పండుగ 3.0లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా తిరుపురాంతకం మండలం జి ఉమ్మడివరం గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షణ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజీ రోడ్డు నుండి నర్సింహస్వామి గుడి వరకు రెండు కోట్ల నిధులతో తారు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఆరు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న మూడు గోకులం షెడ్డులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పశుపోషణను ప్రోత్సహించడం రైతులు పాడి రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా గోకులం షెడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.