సంతనూతలపాడు: చీమకుర్తి గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని నిర్ధారించిన పోలీసులు
చీమకుర్తిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీలో నిన్న భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. క్వారీలో ఉన్న 12 లేయర్ల గ్రానైట్ హై వాల్ నుంచి సుమారు 4 నుంచి 6 లేయర్లు కూలిపోవడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న వారు షిఫ్ట్ ఛేంజ్ కారణంగా బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పిందని శుక్రవారం పోలీసుల విచారణలో తేలింది. అయితే ప్రమాదం లో ఎవరికి ఎటువంటి గాయాలకు సైతం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.