రాయదుర్గం: ఎంపిడివో కార్యాలయం వద్ద ఎంపిటిసి నామినేషన్లు సందర్భంగా పోలీసు బందోబస్తు
రాయదుర్గం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో జరుగుతున్న ఎంపిటిసి నామినేషన్ల చివరి రోజు సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు వారిని అక్కడ నుంచి వెళ్లగొట్టారు. గుంపులుగా గుంపులుగా రాకూడదని 30 పోలీసు యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉందని హెచ్చరిస్తూ వారిని పంపించేశారు. ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ జరిగేందుకు ప్రజలు అందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.