దర్శి: వినాయక చవితి పండుగ సందర్భంగా డీజే లకు అనుమతి లేదని వెల్లడించిన దర్శి సీఐ రామారావు
వినాయక చవితి సందర్భంగా డీజే నిర్వాహకులతో దర్శి సీఐ రామారావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో డీజిల్ ఏర్పాటు చేయడం వల్ల అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలో ఏర్పాటు చేయరాదని నిర్వాహకులకు సూచించారు. వారికి ఎలాంటి అనుమతి లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.