రాయదుర్గం: పట్టణంలో ప్రచారం ప్రారంభించిన టిడిపి అభ్యర్థులు
రాయదుర్గం పట్టణంలోని 30 వ వార్డులో టిడిపి చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు టంకశాల హనుమంతు, మౌనిక ప్రచారాన్ని ప్రారంభించారు. టిడిపి జిల్లా కోశాధికారి కడ్డిపూడి మహబూబ్ బాషా, టిడిపి పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, మాజీ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశులు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు వాల్మీకి అశోక్, టిడిపి సీనియర్ నాయకులు బంగి ఉమాశంకర్ తదితరులతో కలసి ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఎమ్మెల్యే సహకారంతో రాయదుర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని హనుమంతు తెలిపారు. 30 వ వార్డులో వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు టిడిపి ని ఆదరించాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని మౌనిక కోరారు.