రాయదుర్గం: పట్టణంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సిఐ దేవానంద్
రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కుటుంబ సలహా (కౌన్సెలింగ్) కేంద్రాన్ని అర్బన్ సీఐ దేవానంద్ శనివారం ప్రారంభించారు. భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలతో గొడవపడి పోలీస్ స్టేషన్ కు వస్తున్నారని, వారికి తగిన సలహాలు, చట్టంపై అవగాహన కల్పిస్తే తిరిగి అన్యోన్యంగా జీవించే అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు. ఈ కేంద్రాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.