సంతనూతలపాడు: చీమకుర్తిలోని శ్రీ గౌరీ శంకర స్వామి ఆలయంలో ఈనెల 11 నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
చీమకుర్తిలోని మెయిన్ రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ గౌరీ శంకర దేవస్థానంలో ఈనెల 11వ తేదీ నుంచి 20 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ అర్చకులు శేష శ్రీధరశర్మ శనివారం తెలిపారు. నవరాత్రుల్లో ప్రతిరోజూ ఉదయం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్య క్రమాలు, భజనలు, కుంకుమార్చనలు జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జయప్రదం చేయాలని ఆయన కోరారు.