గిద్దలూరు: అర్ధవీడు, అచ్చంపేట గ్రామాల మధ్య నూతన బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం: అర్ధవీడు అచ్చంపేట గ్రామాల మధ్య నూతన బ్రిడ్జి నిర్మాణ పనులపై సాధ్యసాధ్యాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం పర్యటించారు. స్థానిక గ్రామ ప్రజలు 8 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నామని ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం జరిగితే కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే అర్ధవీడుకు చేరుకుంటామని ఎమ్మెల్యేకు స్థానికులు తెలిపారు. నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.