దర్శి: దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ బొటుకు రమేష్ బాబు విలేకరుల సమావేశం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు బోటుకు రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జనసేన పార్టీ పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో కృషి చేశామన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ అధిష్టానం అసమర్థున్ని ఇన్చార్జిగా ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న తమకు సరైన నాయకుడిని ఏర్పాటు చేయాలని కోరారు.