రాయదుర్గం: విజయదశమి పర్వదినం సందర్భంగా కిక్కిరిసిన ఆలయాలు, బన్నీ మహంకాలి ఆలయానికి పోటెత్తిన భక్తులు
విజయ దశమి పర్వదినాన్ని రాయదుర్గం పట్టణంలోని ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని పెద్ద బన్నీమహంకాలి ఆలయానికి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో ఊరేగింపుగా తీసుకు వచ్చి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేశారు. బళ్ళారి రోడ్డు, ఆలయ ప్రాంగణ ప్రాంతాలలో భక్తిశ్రద్దల రాకపోకలతో కిక్కిరిసిపోయింది. ప్రజలు ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.