యర్రగొండపాలెం: నీటితో చెలగాటం ఆడవద్దని యువకులను హెచ్చరించిన మార్కాపురం డి.ఎస్.పి నాగరాజు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆ ప్రాంతాలను మార్కాపురం డిఎస్పి నాగరాజు పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ... నీటి వేగంతో ప్రమాదం పొంచి ఉండడం వల్ల యువకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రీల్స్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నీటితో చెలగాటం ఆడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రాంతాలను చూసి ఆస్వాదించలే తప్ప ప్రమాదంలో పడవద్దు అన్నారు.