రాయదుర్గం: విద్యుత్ కేబుల్ వైర్ల చోరీతో రైతుల ఆందోళన
వ్యవసాయ విద్యుత్ మోటారు కేబుల్ వైర్ల చోరీతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా గుమ్మగట్ట మండలంలోని శిరిగేదొడ్డి పంచాయతీ పరిధిలో ఓబుళేసు అనే రైతు పొలంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సుమారు వంద 30 మీటర్ల విద్యుత్ కేబుల్ వైరు ను కత్తిరించి దోచుకెళ్లారు. గతంలోనూ ఇక్కడ ఇలాంటి చోరీ జరిగినట్లు బాదితుడు తెలిపారు. పోలీసులు కేబుల్ వైరు దొంగలను పెట్టుకోవాలని కోరారు.