రాయదుర్గం: బొల్లనగుడ్డం గ్రామంలో వైభవంగా శ్రీ సద్గురు తోటప్ప అజ్జి రథోత్సవం
బొమ్మనహాల్ మండలంలోని బొల్లనగుడ్డం గ్రామంలో శ్రీ సద్గురు తోటప్ప అజ్జి రథోత్సవం శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆశ్రమంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆంద్ర కర్నాటక ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్త జన సందోహం మద్య రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.