నర్సింహులపేట: నర్సింహులు పేటలో పెద్దపులి సంచారం: భయం గుప్పిట్లో గ్రామస్థులు
నర్సింహులు పేట పెద్ద నాగారం నర్సరీ వద్ద పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి కోసం గాలింపు చేపట్టారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లొద్దని, పాదముద్రలు కనిపిస్తే సమాచారం అందించాలని అధికారులు హెచ్చరించారు.