నర్సింహులపేట: ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారతజవాన్లను,ఘనంగాసన్మానించిన నర్సింహులపేట ఎస్సై సురేష్, పట్టణంలో ర్యాలీ #operationSindoor
ఆపరేషన్ సింధూరిలో పాల్గొన్న భారత జవాన్లను ఘనంగా సన్మానించిన నర్సింహులపేట ఎస్సై సురేష్. పట్టణంలో భారీ ర్యాలీ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో, ఇటీవల పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో, దేశం తరఫున పాల్గొని ,తిరిగి వచ్చిన నర్సింహులపేటకు చెందిన ఊదరి యాకయ్య, గుండ గాని నాగరాజు లను నర్సింహులపేట పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. నర్సింహులపేట ఎస్సై మాలోతు సురేష్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ,యుద్దంలో పాల్గొన్న ఇద్దరు జవాన్లను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.