నర్సింహులపేట: ముంగిమడుగు శివారులో అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు, ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు శివారు బొడ్ఠి తండా శివారులో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు పల్టీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. కారులో ఎయిర్ బెలున్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.