నర్సింహులపేట: సైబర్ నేరగాళ్లు కాజేసిన 80 వేల రూపాయలను రికవరీ చేసిన నర్సింహులపేట పోలీసులు, బాధితులకు అప్పగింత
సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును రికవరీ చేసి బాధితుడికి పోలీసులు అప్పగించారు. నర్సింహులపేట మండలానికి చెందిన ఎస్‌బీఐ మినీ బ్యాంక్ నిర్వాహకుడు గుగులోతు రమేశ్ నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రూ.80 వేలను పోలీసులు గురువారం రికవరీ చేశారు 3నెలల క్రితం పోలీసులమని చెప్పి రమేశ్ దగ్గర నుంచి 80 వేలు ఫోన్ పే చేయించుకున్నారు. మోసపోయానని తెలుసుకున్న రమేశ్ వెంటనే సైబర్ క్రైమ్ 1930 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి సైబర్ నేరగాళ్ల ఖాతాలను స్తంభింపజేసి డబ్బును రికవరీ చేశారు.