నర్సింహులపేట: నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, అడ్డుకొని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు శనివారం రాత్రి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకోగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ తగాదాల్లో తనకు న్యాయం జరగడం లేదం,టూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు హుటాహుటిన 108 లో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .