నర్సింహులపేట: నర్సింహులపేటలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నిదాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండల కేంద్రంలోని, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పిలుపునిచ్చారు . నియోజకవరంలోని ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా విచ్చేసి కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని అన్నారు.