సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సిఐ దాసరి ప్రసాద్
చీమకుర్తి పట్టణంలోని గరికమిట్ట ఏరియాలో సిఐ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎటువంటి ద్రవపత్రాలు లేని మోటార్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిఐ మాట్లాడుతూ... గంజాయి వంటి మత్తుపదార్థాలను విక్రయించిన, అక్రమంగా నిలువ ఉంచిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తీసుకునే చర్యలకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. చీమకుర్తి ఎస్ఐ సంపత్, సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు పాల్గొన్నారు.