యర్రగొండపాలెం: త్రిపురాంతకం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ - కీలక ఆదేశాలు జారీ
త్రిపురాంతకం ఎంపీడీఓ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని, 100 మీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.