రాయదుర్గం: దొడగట్ట చెరువులో మట్టి దోపిడీపై గ్రామస్తుల తిరుగుబాటు, జెసిబి టిప్పర్ ల అడ్డగింత
రైతుల పేరు చెప్పి చెరువు మట్టిని అక్రమంగా తోడేసి టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకుడిపై గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. మట్టి తోడుతున్న జెసిబి లను ఆపి టిప్పర్ లను కదలనీయలేదు. ఈ సంఘటన రాయదుర్గం నియోజకవర్గంలోని డి. హిరేహాల్ మండలం దొడగట్ట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై దొడగట్ట చెరువులో వందల కొద్ది టిప్పర్లు ఎర్ర మట్టిని రైతుల పొలాలకు తరలిస్తున్నాం అనే పేరుతో రైతుల నుంచి బారీగా డబ్బు వసూలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.