దర్శి: దర్శి పట్టణంలో పారిశుద్ధ్య పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపిన కమిషనర్ అర్జున్ రావు
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ అర్జున్ రావు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ప్రజలు పరిసరాలపై అవగాహన కలిగి ఉండి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. మన పరిసరాలు బాగుంటే మనము బాగుంటామని అన్నారు.