రాయదుర్గం: వేపరాళ్ల క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి
రాయదుర్గం మండలం వేపరాళ్ల క్రాస్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృతి చెందినట్లు సిఐ దేవానంద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాశీపురంలో తమ స్నేహితుడిని కలవడానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు తిరిగి శ్రీరంగాపురం వస్తుండగా హైవే రోడ్డుపై కళ్యాణదుర్గం నుండి రాయదుర్గం వైపు అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టిందన్నారు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా రామ్ చరణ్ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్నారని వివరించారు.