రాయదుర్గం: SIR ప్రక్రియ వెంటనే నిలిపివేయాలంటూ పట్టణంలో కాంగ్రెస్, సిపిఐ నిరసన
SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని CPI, కాంగ్రెస్, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం రాయదుర్గం పట్టణంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించడం ద్వారా ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తోందని, దీనికి CEC జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. CPI తాలూకా కార్యదర్శి నాగార్జున, రైతు సంఘం కార్యదర్శి తిప్పేస్వామి, పట్టణ కార్యదర్శి రవీంద్రనాథ్, కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, రఫిక్, మా భాష తదితరులు పాల్గొన్నారు.