రాయదుర్గం: ఎంపిటిసి స్థానాలకు 30 నామినేషన్లు : రాయదుర్గం ఎంపిడిఓ కొండన్న
రాయదుర్గం మండలంలోని 12 ఎంపిటిసి స్థానాలకు రెండవ రోజు గురువారం 30 నామినేషన్లు వచ్చినట్లు ఎంపిడిఓ కొండన్న తెలిపారు. మెదటి రోజు బుధవారం 11 నామినేషన్లు వచ్చాయి. రాయదుర్గం ఎంపిడిఓ కార్యాలయంలో ఆర్ఓ అమరేశప్ప ఈ నామినేషన్లు స్వీకరించారన్నారు. రెండవ రోజు వచ్చిన వాటిన తెలుగుదేశం పార్టీ తరపున 12, వైఎస్సార్సీపీ తరపున 18 నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు.