రాయదుర్గం: రైతుల సంక్షేమానికి పెద్ద పీట : మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి
రైతుల సంక్షేమానికే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి అన్నారు. శనివారం డి.హిరేహాల్ మండలంలోని ఎం.హనుమాపురంలో వ్యవసాయ అధికారులతో కలిసి రైతులకు సబ్సిడీపై విత్తన పప్పు శనగ పంపిణీ చేశారు. 100 క్వింటాళ్ల విత్తనాలను అందజేశారు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ రూ.7500-8000 ఉండగా సబ్సిడీపై రూ.5850కే ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.