రాయదుర్గం: బడిబస్సు కోసం రోడ్డెక్కిన బిదురుకొంతం విద్యార్థులు
కణేకల్లు మండలంలోని బిదురుకొంతం గ్రామానికి చెందిన విద్యార్థులు బడిబస్సు కోసం ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన విద్యార్థులు దర్గాహొన్నూర్ లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేందుకు సమయానికి అనుగుణంగా బస్సు రావడం లేదని సమయానికి బస్సు నడపాలని రోడ్డుపై బస్సులు, వాహనాలు అడ్డుకుని నిరసన చేపట్టారు. బస్సు రాకపోవడం వల్ల పాఠశాలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు.