రాయదుర్గం: బుదవారం నుంచి ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ : ఎంపిడిఓ కొండన్న
రాయదుర్గం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల బుధవారం నుండి నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఎంపిడిఓ కొండన్న తెలిపారు. ఎంపిడివో కార్యక్రమంలో ఈనెల 21 - 23 వరకు ఉదయం 10. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్ ఓ అమరేశప్ప నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారన్నారు. 24న పరిశీలన, 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ కు అవకాశం, 26న అప్పీల్ పరిష్కారం, 27న ఉపసంహరణకు అవకాశం కల్పించి తుది జాబితా ప్రకటిస్తారని వెల్లడించారు. నవంబర్ 3న 12 ఎంపీటీసీలు, జెడ్పీటీసీకి సంబంధించి 41 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.