రాయదుర్గం: పల్లేపల్లిలో ఉరివేసుకుని కర్నాటక వాసి ఆత్మహత్య
రాయదుర్గం మండలం పల్లిపల్లి గ్రామంలో పండగపూట విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం జీరిపల్లికి చెందిన శివ అనే వ్యక్తి దసరా పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి అత్తవారింటికి వచ్చి, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు కారణాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది.