రాయదుర్గం: టి. వీరాపురం గ్రామంలో వైభవంగా దొణ గంగమ్మ జాతర, పోటెత్తిన భక్తులు
రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామంలో దొణగంగమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతీ ఏడాదీ శ్రావణ మాసం చివరి సోమవారం ఈ జాతర నిర్వహిస్తారు. ఆంద్ర కర్నాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం మెత్తం సందడి వాతావరణం నెలకొంది. భక్తులు దొణ వద్ద గంగపూజ చేసి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.